Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక మసీదు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 52 మంది ప్రజలు మరణించినట్లు సమాచారం. మృతులలో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నటు తెలుస్తోంది.
అంతేకాకుండా 130 మందికి పై ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం. బాంబు పేలుడులో హాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందజేస్తున్నారు.
శుక్రవారం మీలాదె నబి పండుగ సందర్భంగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు వద్ద మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఒక పెద్ద బాంబు పేలినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు, అధికారులు మాత్రం ఇది ఆత్మాహుతి దాడి అని అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. మసీదు దగ్గర ఈ ఘటన సంభవించడంతో కరాచీలో హై సెక్యూరిటీ అలెర్ట్ ప్రకటించారు.
అదే సమయంలో డ్యూటీలో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరీ కూడా బాంబు పేలుడులో మరణించినట్లు తెలిపారు.
పాకిస్తాన్ లో బాంబు పేలుడు (Pakistan Suicide Bomb Blast):
#Pakistan #Balochistan #explosion
🇵🇰The location of the explosion that killed several people and injured dozens in Pakistan. At least 52 people have been killed and dozens more have been injured in a suicide bomb attack in a mosque in Pakistan, officials have said. pic.twitter.com/0LxTi1TjWY— Mahmood Khan (@Mahmood88239370) September 29, 2023
#BreakingNews – At least 52 people were killed and more than 130 injured in #Blast near Mosque in #Pakistan #Balochistan Pork Shameful #terrorism #مستونگ #SindhBleeds #Blast #Mastung #PakistanArmy pic.twitter.com/r2OCAeRNPp
— MN TIMES (@mntimes_in) September 29, 2023
ALSO READ: 26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!