బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu resigns BRS Party). ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పంపించడం జరిగింది.
అయితే పోతుగంటి రాములు తొలుత కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు వినిపించినా… చివరికి ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.
పోతుగంటి రాములు తెలుగు దేశం పార్టీ తరఫున అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 1999-2004 మధ్య చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాములు.. 2016లో తీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం 2019లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా (Nagarkurnool MP Ramulu resigns BRS):
బీఆర్ఎస్ పార్టీకి షాక్
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరనున్న నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు pic.twitter.com/4w9lj2JNMP
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024