వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని (MLA Kodali Nani Comments on Jr Ntr) అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని ఒక సభలో మాట్లాడుతూ… 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ కోసం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారని నాని విమర్శించారు. చంద్రబాబు మరియు లోకేష్ ఇద్దరూ కలిసిగట్టుగానే జూనియర్ ఎన్టీఆర్పై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈమేరకు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కనుక గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేస్తారన్నారు. కనుక చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ వెళ్తుందని కొడాలి నాని పేర్కొన్నారు.
అయితే గత కొంత కాలంగ టీడీపీ పార్టీకి మరియు రాష్ట్ర రాజకీయాలకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగ ఉంటుంది విషయం తెలిసినదే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర (Jr Ntr Devara) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఈ విషయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
చంద్రబాబు ఓడిపోతేనే… (MLA Kodali Nani Comments on Jr Ntr):
చంద్రబాబు ఓడిపోతేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుంది!
చంద్రబాబు మళ్లీ గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ను బయటకు గెంటేస్తారు.. కాబట్టి చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది – కొడాలి నాని pic.twitter.com/M6zmSXY8hc
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2024
ALSO READ: MP Bharat: చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ భరత్