Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Date:

Share post:

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే చెప్పాలి. చాలా మంది పిల్లలకు విద్య మాత్రమే కాదు — ఆకలి కూడా ఒక పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో మిడ్-డే మీల్ (Mid Day Meals) పథకం ఒకటి.

 మిడ్-డే మీల్ పథకం అంటే ఏమిటి? (Mid Day Meal Scheme)

ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించబడుతోంది.

ప్రభుత్వం ఈ పథకాన్ని ముఖ్యంగా పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించినట్లు తెల్సుతోంది. అయితే, ఈ పథకం అవసరమా లేదా అనే విషయంలో ప్రజలలో వివిధ అభిప్రాయాలు ఉన్నా… దీన్ని సమతుల్య దృక్పథంతో పరిశీలించడం అవసరం.

 మిడ్-డే మీల్ పథకం అవసరం (Importance):

మొదటగా, ఈ పథకం అవసరాన్ని పరిశీలిస్తే, భారతదేశంలో ఇంకా పేదరికం మరియు పోషకాల సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు అనే చెప్పాలి. ఇప్పటికి చాలా మంది పిల్లలు సరైన ఆహారం లేకుండా స్కూల్‌కు వెళ్తున్నారు. ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. ఈ పరిస్థితిలో మిడ్-డే మీల్ పథకం వారికి కనీస పోషకాహారం అందించి, చదువుపై దృష్టి పెట్టేలా చేస్తోంది అనే చెప్పాలి. అందువల్ల, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ఒక సామాజిక అవసరంగా భావించవచ్చు.

 లాభాలు (Benefits):

ఈ పథకం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా, పిల్లలో పోషకాహారం మెరుగుపడుతుంది అని చెప్పాలి. అలాగే ఉచిత భోజనం వల్ల పిల్లలు స్కూల్‌కు రావడానికి ఆసక్తి చూపుతారు. అందువల్ల పాఠశాల హాజరు పెరుగుతుంది మరియు డ్రాప్‌అవుట్ రేటు తగ్గుతుంది. పేద కుటుంబాలకు ఇది ఒక ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, ఈ పథకం ద్వారా అన్ని వర్గాల పిల్లలు కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక సమానత్వం పెరుగుతుంది.

దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన మరియు విద్యావంతులైన పౌరులు దేశ అభివృద్ధికి దోహదం చేస్తారు అనే చెప్పుకోవచ్చు.

 లోపాలు (Drawbacks):

అయితే, ఈ పథకంలో కొన్ని లోపాలు కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ముఖ్యంగా కొన్నిచోట్ల భోజనంలో నాణ్యత తక్కువగా ఉండడంతో పిల్లల ఆరోగ్యపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు మీడియా కథనాలతో వెలువడుతున్నాయి. అలాగే నిర్వహణలో లోపాలు, సరఫరాలో ఆలస్యం వంటి సమస్యలు కూడా పలు చోట్ల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం అవినీతి. మీడియా సమాచారం ప్రకారం అలాగే వస్తున్న వార్తలు దృష్ట్యా… కొన్ని ప్రాంతాల్లో ఈ పథకానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పిల్లలకు ఆహారం అందించే ప్రక్రియలో భాగంగా పలు చోట్ల నాసిరకమైన పదార్థాల వినియోగం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు మీడియా కధనాలు చెప్తున్నాయి. ఈ అవినీతి కారణంగా పథకం లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు అనే చెప్పుకోవాలి.

 ప్రభుత్వంపై ఆర్థిక భారం (Impact):

ఇకపోతే ప్రభుత్వ బడ్జెట్ పరంగా చూస్తే, ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. ఇది ఒకవైపు ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుండగా, మరోవైపు ఈ పథకాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడిగా కూడా మనం పరిగణించవచ్చు. ఆరోగ్యంగా, చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదపడతారు.

పరిశీలనలు & ఫలితాలు (Observations & Findings):

అయితే ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కొన్ని చర్యలు అవసరం. ఇందుకు ముఖ్యంగా ఆహార నాణ్యతపై కట్టుదిట్టమైన నియంత్రణ ఉండాలి. పారదర్శకతను పెంచాలి మరియు డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేస్తే మంచిది. ముఖ్యంగా అవినీతికి పాల్పడినవారు పై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక సమాజం మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని కూడా పెంచడం అవసరంగా భావించాలి.

ముగింపు (Conclusion):

ముగింపుగా, మిడ్-డే మీల్ పథకం భారతదేశంలో విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధికి ఒక ముఖ్యమైన సాధనం. అయినప్పటికీ ఈ పథకం అమలు విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దడం అత్యవసరం. సరైన అమలు మరియు పర్యవేక్షణతో ఇది లక్షలాది పిల్లల జీవితాలను మార్చగలదు. ఈ పథకం అమలును మరింత మెరుగు పరిస్తే మరింత సమర్థవంతంగా మారుతుంది అని అభిప్రాయం.

ALSO READ: విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

UPSC చైర్ పర్సన్ గా ప్రీతీ సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

నీట్‌ పరీక్షల లీకేజీకి (NEET) నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నేడు (గురువారం) బంద్‌కు (Bharat Bandh- Schools and...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

AP SSC Hall Tickets: పదోవ తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల...

TS DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను (TS Mega...

ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్

1వ తరగతి పిల్లల అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Class 1 admission minimum age). ఇకపై ఆరేళ్లు...

AP DSC 2024 Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల (AP DSC 2024 Notification...

CM Breakfast Scheme: విద్యార్థులతో పాటు కేటీఆర్ బ్రేక్ ఫాస్ట్

CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ఈ రోజు ఉదయం తెలంగాణ...