1వ తరగతి పిల్లల అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Class 1 admission minimum age). ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకు (First Class students admission minimum age 6 years) మాత్రమే ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
NEP 2020, RTE ACT 2009 కింద ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరు ఏళ్ళు తప్పనిసరి అని పేర్కొంది
ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ అంశంపై లేఖలు రాసింది. మరియు ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే అమలు చేయాలని ఈ లేఖలో పేర్కొంది.
నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆరేళ్లు నిండితేనే (First Class admission minimum age 6 years):
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశం
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ
2024 – 25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1/ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.
నూతన… pic.twitter.com/hDr3GbTqDZ
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటో తరగతిలో అడ్మిషన్..#nationaleducationpolicy #1stclass #class1 #above6years #NTVTelugu #TeluguNews pic.twitter.com/KiEaC1RfE5
— NTV Telugu (@NtvTeluguLive) February 27, 2024
ALSO READ: రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే