బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.
బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్ వారి పాలనే కొనసాగిందనీ, 2014లో దేశానికి నిజమైన స్వాతంత్ర౦ వచ్చిందని పేర్కొంది.
దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి స్వాత౦త్ర౦ తీసుకొచ్చిన అమరవీరులను అవమాని౦చడ౦ దారుణం అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2014లో భారతదేశానికి “నిజమైన స్వాతంత్ర౦” లభించిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, ఆమె ఆలోచనను “పిచ్చి” లేదా “దేశద్రోహం” అని పిలవాల అని తాను ఆలోచిస్తున్నానని ట్వీట్ చేసారు.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
క౦గనా రనౌత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, పలువురు ప్రముఖులు కూడా క౦గనా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో… 1947లో భారతదేశం సాధించినది “భిక్ష” అని ఆమె చెప్పింది. “అది స్వాతంత్ర౦ కాదు, ‘భీఖ్’ (భిక్ష), మరియు నిజమైన స్వాతంత్ర౦ 2014లో వచ్చింది,” అని క౦గనా మాట్లాడి౦ది.
“కొన్నిసార్లు వారు మహాత్మా గాంధీ త్యాగాన్ని మరియు దేశభక్తిని అవమానిస్తారు, ఆపై వారు తరచుగా అతన్ని హత్యచేసిన వాడిని గౌరవిస్తారు… ఇప్పుడు మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లా౦టివారితో పాటు లక్షల మ౦ది స్వాతంత్ర సమరయోధులు మరియు వారి త్యాగాలను తృణీకరిస్తున్నారు. నేను అలాంటి భావాలను “పిచ్చి లేదా రాజద్రోహం” అని పిలువనా? ” అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
అదే కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ, తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం లేదని, అయితే తనకు చాలా అవగాహన ఉందని, కళాకారిణిగా, జాతీయవాదిగా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడతానని అన్నారు.
సావర్కర్ గురించి మరియు అతను దేశభక్తుడు కాదని కాంగ్రెస్ ఆరోపణ గురించి కంగనా మాట్లాడుతూ… “ఇది చాలా పెద్ద విషయం. చాలా స్టడీ చేసి సినిమా కూడా చేశాను. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకోలేదనే విషయ౦ చాలా స్పష్టంగా ఉంది, కరెక్టే కదా? వారు ఈ దేశాన్ని బలవంత౦గా ఆక్రమి౦చుకున్నారు. అక్కడక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి కానీ 1857లో స్వాతంత్య్ర౦ కోసం నిర్ణయాత్మక పోరాటం జరిగింది. ఆ తర్వాత జరిగినది చరిత్రలో అత్యంత దురదృష్టకరం. యూదులకు జరిగిన దానికంటే దురదృష్టకరం. జలియన్‌వాలాబాగ్ మారణకాండ లేదా బెంగాల్ కరువు అని మీడియాలో ముద్రించబడలేదు అని వ్యాఖ్యాని౦చి౦ది.