సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం (SRH beat RCB by 25 Runs) సాధించింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాట్టింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్లు అభిషేక్ (34) హెడ్ (102) లు చేయగా తరువాత వచ్చిన క్లాసీన్ (67), మార్కరం (32), అబ్దుల్ (37) దూకుడు బ్యాట్టింగ్ తో జట్టుకు భారీ స్కోర్ ను అందించడంలో సఫలం అయ్యారు.
అనంతరం 288 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు… ఓపెనర్లు డు ప్లేసెస్ (62), కోహ్లీ (42) చక్కటి భాగస్వామ్యం అందించారు. అయితే వీరిద్దరి దూకుడికి హైదరాబాద్ బౌలర్ మార్కండే బ్రేక్ వేసాడు. కోహ్లీను 42 పరుగుల వద్ద మార్కండే బౌల్డ్ చేసాడు. తదుపరి బ్యాట్టింగ్ కు వచ్చిన జాక్స్(7), పట్టిదర్(9), సౌరవ్ (0) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీంతో బెంగళూరు కష్టాలలో పడింది.
కష్టాలో ఉన్న జట్టును దినేష్ కార్తీక్ ఆదుకున్నాడు. ప్రత్యర్థి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేయగలిగింది.
ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ పట్టికలో (IPL Points Table) సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి చేరగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ ఓటమితో చివరి స్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ ఘన విజయం (SRH beat RCB by 25 runs):
SRH DEFEATED RCB AT THE CHINNASWAMY STADIUM. 💥 pic.twitter.com/zAoR1odDSo
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024
ALSO READ: Rishabh Pant: రిషబ్ పంత్ కు భారీ జరిమానా