IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో (Punjab Kings Beat Chennai Super Kings) విజయం సాధించింది.
తొలుత బ్యాట్టింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్… ఓపెనర్లు గైక్వాడ్ (62) మరియు రెహానే (29) పవర్ ప్లే లో చక్కటి భాగస్వామ్యం అందించారు. అయితే పవర్ ప్లే అనంతరం పంజాబ్ బౌలర్ల ధాటికి అంతగా రాణించలేకపోయింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్… జానీ బెయిర్ స్టో (46 ) రొసో (43 ) పరుగులతో దూకుడు బ్యాట్టింగ్ చేశారు. అయితే వీరిద్దరూ అవుట్ ఆయన అనంతరం చివరి 8 ఓవర్లలో పంజాబ్‌కు 50 పరుగులు అవసరమైన సందర్భంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, సామ్ కరణ్ మరో వికెట్ పడకుండా జట్టుకి విజయాన్ని అందించారు. దీంతో 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించింది.
ఈ మ్యాచ్ లో విజయంతో వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి అనంతారు విజయం సాధించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఏడవ స్థానంలో నిలవగా… చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఓటమితో 10 పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : హర్‌ప్రీత్ బ్రార్
పంజాబ్ కింగ్స్ విజయం (Punjab Kings beat Chennai Super Kings):
PUNJAB KINGS DEFEATED CSK FOR THE 5TH CONSECUTIVE TIME. 🤯🔥 pic.twitter.com/5gTLMZRWKB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024
ALSO READ: IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం