IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 47 పరుగుల తేడాతో విజయం (India beat Afghanistan by 47 runs) సాధించింది.
ఈ మ్యాచ్ల్లో తొలుత టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. బ్యాట్టింగ్ లో ఇండియన్ ఓపెనర్లు కొంత విఫలం అయినప్పటికీ జట్టుని సూర్య కుమార్ యాదవ్ (53), హార్దిక్ పాండ్య (32) పరుగులతో ఆదుకున్నారు.
అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి ఆఫ్ఘానిస్తాన్ జట్టుని ఇండియా బౌలర్లు కుదేలు చేశారు. ఇండియా బౌలర్లు బుమ్రా (3), అర్షదీప్ (3), కుల్దీప్ (2) వికెట్లు తీస్కుని చెలరేగడంతో ఆఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఆఫ్గనిస్తాన్ బ్యాటరలలో అజమాతుల్లాహ్ (26) పరుగులు తప్ప మిగిలినవారెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోవడం హమానార్హం.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: సూర్య కుమార్ యాదవ్ (53 పరుగులు)
ఇండియా ఘన విజయం (India beat Afghanistan by 47 runs):
A 47-run victory in Barbados 🥳🏖️#TeamIndia kick off their Super 8 stage with a brilliant win against Afghanistan 👏👏
📸 ICC
Scorecard ▶️ https://t.co/xtWkPFaJhD#T20WorldCup | #AFGvIND pic.twitter.com/qG8F3XJWeZ
— BCCI (@BCCI) June 20, 2024
ALSO READ: Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్