దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా విజయం సొంతం (India Won 2nd Test Match against South Africa) చేసుకుంది. దక్షిణాఫ్రికా లో కేప్ టౌన్ వేదికగా ఇండియా మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజులోనే ఆతిధ్య దక్షిణాఫ్రికా ను చిత్తుచేసింది.
దక్షిణాఫ్రికా: 55-10 ; 176-10
ఇండియా: 153-10; 80-3 (విజేత)
తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఇంకా 36 పరుగులు వెనకపడి ఉంది. రెండో రోజు బ్యాట్టింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఇండియా బౌలర్ల ధాటికి 176 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ మార్కరం ఒక పక్క వికెట్ లు పడుతున్న మరోపక్క తన దూకుడైన ఆటతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ క్రమంలో మార్కరం సీతాకాన్ని కూడా పూర్తిచేసుకోవడం గమనార్హం. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 176 పరుగులకి ఆల్ అవుట్ కాగా… జట్టుకు 78 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇండియా బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీయగా… ముఖేష్ రెండు, సిరాజ్ మరియు ప్రసిద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 79 పరుగుల లక్ష్యం తో రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్టింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్ జైస్వాల్ ప్రత్యర్థి మీద విరుచుకు పడ్డాడు. అనంతరం 28 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన గిల్, కెప్టెన్ రోహిత్ తో కలిసి లక్ష్యం అందుకునే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో గిల్ తరువాత వచ్చిన కోహ్లీ కూడా కొద్ది పెవిలియన్ బాట పట్టారు.
కోహ్లీ వికెట్ అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన ఇయర్ రోహిత్ తో కలిసి మరో వికెట్ పడకుండా కొద్ది బంతులలోనే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను ఇండియా సమం 1-1 చేసి వైట్ వాష్ కాకుండా కాపాడుకుంది.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్: సిరాజ్
మ్యాన్ అఫ్ ది సిరీస్: బుమ్రాహ్, ఎల్గార్
ఇండియా విజయకేతనం (India won 2nd Test Match):
India won the Test match. The India-South Africa Test match concluded in 107 overs. 33 wickets fell, and the match lasted only 1.5 days. Last year, India created a challenging bowling pitch, and foreign players criticized India. Where are they now? #INDvsSA pic.twitter.com/lSg5OrT4V6
— Anil Tiwari (@Anil_Kumar_ti) January 4, 2024
ALSO READ: IND vs SA 2nd Test: తొలి రోజు బౌలర్ల దూకుడు… 23 వికెట్ లు