ICC ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 రేపటి నించే ప్రారంభం కాబోతోంది. దాదాపు ఏడు ఏళ్ళ తరువాత ఐసీసీ టోర్నికి వేదికగా భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న విషయం తెలిసినదే.
రేపు అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్ లో 2019 ఫైనలిస్టులు అయిన ఇంగ్లాండ్ మరియు న్యూజీలాండ్ తలపడనున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే వరల్డ్ కప్ 2023 టిక్కెట్లు హాట్ కేకులులా అమ్ముడవుతున్నాయి. క్రికెట్ అభిమానులు టికెట్ ల కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు.
లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడాలి? (Where can I watch ICC ODI World Cup matches?)
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రేక్షకులు మ్యాచ్ లని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్ లో చూడగలరు. అంతే కాకుండా మొబైల్, స్మార్ట్ టీవీ, లాప్టాప్ లో చూడాలనుకునే వారికోసం డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney Plus Hotstar) అన్ని మ్యాచ్‌లను యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
అంతే కాకుండా మ్యాచ్ లు అన్నింటిని ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ప్రేక్షకులు ఫ్రీగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వీక్షించుచు.
మ్యాచ్ లు ఏ సమయంలో స్టార్ట్ అవుతాయి?
డే మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా, డే-నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
హాట్ ఫేవరెట్ ఎవరు?
క్రికెట్ లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. దీనికి కారణం హోమ్ గ్రౌండ్ పై ఆ జట్టుకు ఉన్న అనుభవమే అని చెప్పాలి. అంతేకాకుండా 2011 నుంచి 2019 దాక జరిగిన మూడు వన్డే వరల్డ్ కప్ లని పరిశీలించగా గ్రౌండ్ అడ్వాంటేజ్ తో 2011 లో భారత్, 2015 లో ఆస్ట్రేలియా మరియు 2019 లో ఇంగ్లాండ్ జట్లు వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నాయి.
ఈసారి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో మరియు వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇకపోతే 2019 లో వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఈసారి కూడా వన్డే వరల్డ్ కప్ రేసులో నెక్స్ట్ ఫేవరెట్ గా ఉందనడంలో సందేహం లేదు.
మరి ఇప్పటికి వన్ డే వరల్డ్ కప్ (ODI World Cup) ను 5 సార్లు కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్ లిస్ట్ లో చేరిపోయింది. ఇదిలా ఉండగా గత సారి 2019 వన్డే వరల్డ్ కప్ లో ఆఖరి వరుకు పోరాడి ఓడిపోయిన న్యూజీలాండ్ ఈసారి ఎలా ఆయన కప్పు కొట్టాలి గట్టిగ ప్రయత్నిస్తోమ్ది.
ఇండియా వర్సెస్ పాక్ ఎప్పుడు? (When is India Vs Pakistan World Cup 2023 match?)
భారత్ లో క్రికెట్ ఆట పట్ల కేవలం యువతతోనే కాకుండా అన్ని వయసులవారి హృదయంలో ప్రేత్యేక స్థానం సంపాదించుకుంది. మరి ఎలాంటి మ్యాచ్ల్ లో దాయాదులయిన ఇండియా మరియు పాకిస్తాన్ తలపెడితే ఇక ఆరోజు అసలైన పండగే అని చెప్పాలి. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి.
ఇప్పటికే ఈ ఇరు జట్టు వరల్డ్ కప్ లో ఏడుసార్లు తలపడగా ఇండియా ఏడుసార్లు పాక్ ను ఓడించింది. అయితే ఈసారి ఎలాగైనా ఇండియా ను ఓడించి బోణి కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు.
దీంతో అక్టోబర్ 14న జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరు దేశ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ICC World Cup 2023: England Vs Newzeland
Star Sports' promo on England vs New Zealand opening match in this World Cup 2023.
The battle of two finalists in the last World Cup – The Incredible Rivalry..!! pic.twitter.com/XQFiZL1TX1
— CricketMAN2 (@ImTanujSingh) October 2, 2023
The hosts have won the last three men's @CricketWorldCup 🏆
Who will win #CWC23?
Here's all you need to know ahead of the event: https://t.co/cctAe0Umk2 pic.twitter.com/lywekJPQ6Q
— ICC Cricket World Cup (@cricketworldcup) September 29, 2023
ALSO READ: సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్