కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి చేశారు.
ఈ ఘటన డిసెంబర్ 29న బెళగావి జిల్లా ముదలగి ప్రాంతంలో జరిగినట్లు ఇ౦డియా టుడే నివేది౦చి౦ది.
ఇ౦డియా టుడే కధన౦ ప్రకార౦… పాస్టర్ అక్షయ్‌కుమార్ కరగన్వి తన నివాసంలో ప్రార్థనలు చేస్తుండగా, రైట్‌వింగ్ సభ్యులు అతని ఇంటిపై దాడి చేసి ప్రార్థన సెషన్‌ను ఆపాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ పొరుగి౦టివారిని అక్రమంగా మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు.
దు౦డగులు వేడి కూరను ఒక మహిళపై విసిరారని పాస్టర్ భార్య కవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం దాడికి గురైన మహిళ బెలగావిలోని ఓ ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న పేర్కొన్నారు. అయితే దాడి జరుగుతున్నప్పుడు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మరో మహిళపై కూడా దాడి చేశారని ఫిర్యాదుదారు తన క౦ప్లై౦ట్ లో పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత శివానంద్ శివలింగప్ప, రమేష్ దండాపూర్, పరసప్ప బాబు, ఫకీరప్ప బాగేవాడి, కృష్ణ కాంతికర్, చతన్ రాజేంద్ర, మహంతేష్ బసలింగప్ప అనే ఏడుగురు నిందితులపై ఘటప్రభ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వార౦తా ముదలగి నివాసులని తెలుస్తో౦ది.
నిందితులపై IPCలోని వివిధ సెక్షన్లు 143 (అల్లర్లు), 448 (అతిక్రమించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 392 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు.
With inputs from India Today