Telangana: పార్లమెంట్ ఎన్నికల దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం (BRS MP Venkatesh Netha Borlakunta Joins Congress) పుచ్చుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
అయితే వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా పని చేస్తున్న విషయం తెలిసినదే. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితిలో చేరగా… ఆయనకు పెద్దపల్లి ఎంపీ సీటును అప్పట్లో బీఆర్ఎస్ కేటాయించింది.
కాగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించిన వెంకటేష్ నేత … ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, కే.సీ వేణుగోపాల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ (BRS MP Borlakunta Venkatesh Netha Joins Congress Party)
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ..!#BRS #MP #VenkateshNetha #CMRevanthreddy #Congress #Telangana #NTVTelugu pic.twitter.com/xbVyvtPrpR
— NTV Telugu (@NtvTeluguLive) February 6, 2024
BRS MP from Peddapalli – Venkatesh Netha joined Congress
Ex TTD board member M Jeevan Reddy also joined Congress pic.twitter.com/IIgHSlDG93
— Naveena (@TheNaveena) February 6, 2024
ALSO READ: విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!