Bihar Train Accident: పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్సప్రెస్స్… నలుగురు మృతి

Date:

Share post:

Bihar North East Express Train Accident: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి అసోంకు బయలుదేరుతున్ననార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం రాత్రి బీహార్‌లో పట్టాలు తప్పింది. బీహార్‌లో బక్సర్‌ జిల్లా రఘునాథ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో దాదాపు 21 కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా… 100 మందికిపైగా ప్రయాణికులు  గాయపడినట్లుగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌… రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు (NDRF) తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడినివారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించినట్లు తెలుస్తోంది.

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం (Bihar North East Express Train Accident):

ALSO READ: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

అన్నమయ్య జిల్లా: తిరుమల దర్శనం అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం

Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శం పూర్తి చేసుకుని భక్తులు తిరిగి ఇంటికి వెళ్తుండగా...