ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పేరును శనివారం అధిష్టానం ప్రకటించింది (Bhuma Akhila Priya Reddy Allagadda TDP MLA Candidate). ఈ మేరకు తన సంతోషాన్ని భూమా అఖిల ప్రియ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జి అయిన నన్ను రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మీ కుటుంభంలో ఒక సభ్యురాలిగా వుంటూ మీ కష్ట నష్టంలో సదా మీకు తోడుగా వుంటానని భూమా అఖిల ప్రియ తెలియచేసారు.
భూమా అఖిలప్రియ 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినా విషయం తెలిసినదే. ఈమె 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పని చేశారు. అయితే 2019 లో టీడీపీలో చేరి ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.
ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి Bhuma Akhila Priya Allagadda TDP MLA Candidate):
భూమా అభిమానులకు శుభోదయం!
ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జి అయిన నన్ను ఈ రోజు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం చాలా ఆనందకరం.ఇందులో నా కష్టం కన్నా మీరు నా ఆర్హతలని రాష్ట్రానికి రాష్ట్ర నాయకునికి తెలియపరచి నా మీద మరింత బాధ్యత ను పెంచారు..ఇక నాయకురాలిగా…
— Bhuma Akhila Priya Reddy (@bhuma_akhila) February 24, 2024
ALSO READ: తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్