తెలంగాణ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ బరిలో దిగేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు Bandla Ganesh gave application for Malkajgiri Parliament Candidate.
శుక్రవారం ఉదయం మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు (Bandla Ganesh Malkajgiri MP Candidate) గాను గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అందరి ఆశీస్సులు కావాలంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అలాగే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి తాను గర్వపడుతున్నట్లు తెలిపారు.
ఎంపీ అభ్యర్థిగా బండ్ల గణేష్ (Bandla Ganesh Applies for Malkajgiri Parliament (MP) Candidate):
https://twitter.com/ganeshbandla/status/1753282673370415545
ALSO READ: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి: బీరయ్య యాదవ్