ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling Act Cancelled) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం… రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలోని వారందరు సుముఖంగా అవును అనడంతో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించడమైనదని (AP Land Titiling Act Removed) స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అచ్చమైన తెలుగులో, ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా సభా వ్యవహారాలు నడిపించగా… వారిని సభ్యులందరూ అభినందించారు.
మరొకపక్క ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు అంగీకరించింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు (AP Land Titiling Act Cancelled):
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం.
అచ్చమైన తెలుగులో, ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా చదివిన సభాపతిని అభినందించిన అసెంబ్లీ సభ్యులు.#APAssembly#AndhraPradesh pic.twitter.com/QcLC6jPisS— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024
ALSO READ: అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్