AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కి పిలుపునిచ్చింది తెలుగుదేశం.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చం నాయుడు, “ఆందోళనలో పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చెయ్యాలి” అని విజ్ఞ్యప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ బంద్ పిలుపుకు తన మద్దతును తెలియజేయడం జరిగింది అని తెలుస్తోంది.
శనివారం ఉదయం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మోసం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది.
కేసు విచారణ అనంతరం చంద్రబాబును విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో సోమవారం తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ను సీఐడీ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికు తీసుకొచ్చారు అని తెలుస్తోంది.
చంద్రబాబు కు ఈ నెల 22 వరుకు రిమాండ్ విధిచడంతో రాజమండ్రి పోలీసులు నగర పరిధిలో 144 సెక్షన్ విధించారు.
ఇదొక దమనకాండ- అచ్చం నాయుడు:
చంద్రబాబు అరెస్ట్ పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చం నాయుడు పేర్కొన్నారు. ఈ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా ఏ.పీ. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 11.09.2023 న బంద్ చేపట్టాలి అని పిలుపునిచ్చారు.
ALSO READ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత