ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent Strike Rate in AP elections 2024) విజయం సాధించింది. ఈ విజయం జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి జనసేన సరికొత్త రికార్డు నమోదు చేసింది.
అయితే గత (2019) ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితం అయిన జనసేన ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజల విశేష ఆదరణతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీచేయగా 8 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
ఇకపోతే పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70 వేల మెజారిటీతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి పోటీకి దిగిన వంగా గీత 70,279 ఓట్లు వెనుకబడి ఓటమి పాలు అయ్యింది.
జనసేన 100% స్ట్రైక్ రేట్ (Janasena 100 percent Strike Rate):
Historic Mandate that will be remembered for ages. #GameChanger of Andhra Pradesh Politics @PawanKalyan ✊
MLAs 21/21 ✔️
MPs 2/2 ✔️
100% strike rate ✔️JAI HIND !!#KutamiTsunami pic.twitter.com/3FD4gj9aBK
— JanaSena Party (@JanaSenaParty) June 4, 2024
ALSO READ: AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం