SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో విజయం (SRH beat LSG) సాధించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో 165 పరుగులు చేసింది. లక్నో బ్యాట్టింగ్ లో ఓపెనర్లుగా వచ్చిన డి కాక్(2) రాహుల్(29) ఆ తరువాత వచ్చిన స్టాయిన్స్ (3), పాండ్య (24) తక్కువ పరుగులకే వెనుతిరగడంతో జట్టు కష్టాలలో పడింది. అయితే ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన పూరన్ (48) బడోని (55) పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
అనంతరం ౧౬౬ పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్… లక్నో సూపర్ గైన్స్ పై విరుచుకు పడ్డారు. కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించారు. ఓపెనర్లుగా బ్యాట్టింగ్ కు వచ్చిన అభిషేక్ (75), హెడ్ (89) పరుగులతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్
లక్నోపై హైదరాబాద్ ఘనవిజయం (SRH beat LSG by 10 Wickets):
SRH vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం.. 10 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు.. సిక్సర్లతో విరుచుకుపడ్డ హెడ్, అభిషేక్.. 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్#IPLCricket2024 #IPL2024 #SRHvLSG #LSGvsSRH
— NTV Breaking News (@NTVJustIn) May 8, 2024
ALSO READ: MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు