హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది (Hyderabad coach misbehavior with Woman Cricketers) . దీంతో మహిళా క్రికెటర్లు అంతా హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు.
కోచ్ జైసింహా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ కోచ్ ఉన్న జైసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్లకు రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారులకు సూచించింది.
మీడియా కధనం ప్రకారం… మహిళా హైదరాబాద్ క్రికెట్ జట్టు మ్యాచ్ కోసం విజయవాడ వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించడం జరిగింది.
ఆలస్యం వాళ్ళ ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా హైదరాబాద్‌కు బయల్దేరిన జైసింహ బస్‌లో బయలుదేరారు. ప్రయాణ క్రమంలో కోచ్ జై సింహా మద్యం తాగుతూ మహిళా క్రికెటర్లను బూతులు తిట్టినట్లు ఆరోపణలు చేశారు.
కోచ్ అసభ్య ప్రవర్తన (Coach Misbehavior with Hyderabad Woman cricketers):
మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన #Hyderabad #WomenCricketers #JaiSimha #HCA #NTVNews #NTVTelugu pic.twitter.com/01Bp8cONy5
— NTV Telugu (@NtvTeluguLive) February 16, 2024