తెలంగాణ: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన రాయితీ ఇవాళ్టితో ముగియనుంది (Last day for Pending Challans Clearance). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్ల పై డిస్కౌంట్ (Pending Challans Discount) ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీని గడువు జనవరి 10 వరకే ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో… తమ పెండింగ్ చలాన్లు చెల్లిస్తే 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మరి బుధవారం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్ ఇ-చలాన్లకు సంబంధించి పూర్తి జరిమానాను వసూలు చేయనున్నట్లు సమాచారం.
నేడే ఆఖరు తేదీ (Pending Challans Clearance):
హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్.. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం, బైక్ చలాన్లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్#Telangana #Hyderabad…
— NTV Breaking News (@NTVJustIn) January 10, 2024
ALSO READ: జీరో టికెట్ తీసుకుకపోతే రూ.500 జరిమానా