దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కు (Mohammed Shami received Arjun Award) దక్కింది. అలాగే భారత పేసర్ షమీతోపాటు 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకోనున్నట్లు సమాచారం.
ఈ మేరకు మహ్మద్ షమీ మంగళవారం మాట్లాడుతూ ‘‘ అర్జున్ అవార్డు దక్కడం ఒక కల… చాలామందికి జీవితకాలం మొత్తం ఈ అవార్డు దక్కదు. అలాంటిది నాకు ఈ అవార్డు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు.
అంతేకాకుండా చాలా మందికి నెరవేరని కల ఇది. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల చాలా గర్వపడుతున్నాను అని షమీ చెప్పుకొచ్చాడు.
అయితే వరల్డ్ కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ ప్రతుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్టు షమీ చెప్పుకొచ్చాడు.
మరియు ట్రైనింగ్ సెషన్లను కూడా మొదలుపెట్టానని, ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ (Ind Vs Eng Test Series) సమయానికి తాను అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మొహమ్మద్ షమీ కి అర్జున్ అవార్డు (Mohammed Shami received Arjun Award):
#WATCH | Delhi: Mohammed Shami received the Arjuna Award from President Droupadi Murmu at the National Sports Awards. pic.twitter.com/znIqdjf0qS
— ANI (@ANI) January 9, 2024
#WATCH | Delhi: On being declared as the recipient of the Arjuna Award, Indian Cricketer Mohammed Shami says, "This award is a dream, life passes and people are not able to win this award. I am happy that I have been nominated for this award…" pic.twitter.com/YZ2L5alkjL
— ANI (@ANI) January 8, 2024
ALSO READ: IND vs SA 2nd Test: రెండో టెస్ట్ భారత్ సొంతం… సిరీస్ సమం