వైసీపీ పార్టీ శ్రేణులకి ఊహించని షాక్ తగిలింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తునట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు (Ambati Rayudu Quits YSRCP Party).
అయితే ఈ మధ్యనే ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ లో చేరిన అంబటి రాయుడు నెల తెరగాక ముందే పార్టీ ని వీడారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కేవలం కొంత కాలం తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాయుడు తెలిపారు. మరియు తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు అంబటి రాయుడు.
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.
Thank You.
— ATR (@RayuduAmbati) January 6, 2024
ALSO READ: వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల