ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున (IND Vs SA 2nd test) ఇరు జట్ల బౌలర్లు తమ దూకుడు చూపించారు. కేప్ టౌన్ వేదిక దక్షిణాఫ్రికా తో జరుగుతం రెండో టెస్ట్ లో తొలి రోజు బౌలర్ల ధాటికి బాట్స్మెన్ తాళలేకపోయారు.
SA (1st Innings): 55-10 (23.2 ఓవర్లు)
IND (1st Innings): 153-10 (34.5 ఓవర్లు)
SA (2nd Innings): 62-3 (17 ఓవర్లు) ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది.
తొలి రోజు ముందుగా టాస్ గెలిచి బాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఇండియా బౌలర్ల ధాటికి ఒకరి తరువాత ఒకరు పవేలిన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెదింఘం మరియు వేర్రేయ్న్ మిన్నగా ఎవరు రెండు అంకెల స్కోర్ చేయలేదు. ఇండియా బౌలర్లు సిరాజ్ 6 వికెట్లు… బుమ్రా మరియు ముఖేష్ చెరో 2 వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడేందుకు బ్యాట్టింగ్ కు దిగిన ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. తరువాత ఇన్నింగ్స్ చక్కడిదే ప్రయత్నం చేశారు రోహిత్ మరియు గిల్. అయితే రోహిత్ 39 పరుగుల వద్ద నిష్క్రమించగా… కోహ్లీ తో గిల్ కాసేపు రన్స్ రాబట్టారు.
అయితే గిల్ 36 పరుగుల వద్ద బర్గర్ బౌలింగ్ లో అవుట్ కాగా తరువాత వచ్చిన ఇయర్ పరుగులేమి చేయకుండా అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా కష్టాలలో పడింది. తరువాత రాహుల్ తో కోహ్లీ టీ బ్రేక్ వరకు వికెట్ పడకుండా కాపాడారు.
టీ బ్రేక్ అనంతరం ఇండియా బ్యాట్టింగ్ అనూహ్యంగా కుప్పకూలింది. 153-4 తో ఉన్న ఇండియా తరువాత ఒక్క పరుగు కూడా చేయకుండా 6 వికెట్లను కోల్పోయింది. దీంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ 153 కు ఆల్ అవుట్ అయ్యారు. ఇండియా బ్యాటర్లలో కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ లలో రబడా, బర్గర్ మరియు ఇంగిడి మూడేసి వికెట్లు తీసి ఇండియా భారీ ఆధిక్యం చేయకుండా కట్టడి చేశారు.
తదుపరి 98 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ బ్యాట్టింగ్ కు దిగింది దక్షిణాఫ్రికా. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ మార్కరం మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు. అయితే ఈ క్రమంలో టీం 37 పరుగుల వద్ద డీన్ ఎల్గార్ వికెట్ కోల్పోయింది. అనంతరం కొద్దీ పరుగులకే జార్జి మరియు స్టబ్స్ వికెట్లను కోల్పోయింది. దీంతో తొలి రోజు పూర్తి అయ్యే సరిగి దక్షిణాఫ్రికా 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి… ఇంకా 36 పరుగులు వెనకపడి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో ఇండియా బౌలర్లు ముఖేష్ రెండు వికెట్ లు మరియు బుమ్రా ఒక్క వికెట్ తీసుకున్నారు.
IND vs SA 2nd test Day 1:
Stumps on Day 1.
23 wickets, one hell of a Day, incredible action with domination with the ball. pic.twitter.com/LoYTfD4Hh5
— Johns. (@CricCrazyJohns) January 3, 2024
ALSO READ: IND vs SA ODI: తొలి వన్డే లో దక్షిణాఫ్రికా చిత్తు