ఏపీ లో వైసీపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరినట్లు (YCP MLC Vamsi Krishna joins Janasena) తెల్సుతోంది.
ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ ను కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్.
అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ… జనసేన పార్టీలోకి రావడంతో నాకు పార్టీ మారినట్టుగా అనిపించడం లేదని. తన సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది అని వ్యాఖ్యలు చేశారు.
మరియు గతంలో తాను పవన్ కళ్యాణ్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగంలో పనిచేశాను అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పవన్ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు.
అంతేకాకుండా ఉత్తరాంధ్రలోను మరియు విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు… పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు తన సర్వశక్తులు ధారపోస్తాను అని అన్నారు.
తన తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ ప్రజలందరూ స్వాగతిస్తారని నమ్ముతున్నాను అని వంశీకృష్ణ ధీమా వ్యక్తపరిచారు.
జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ (YCP MLC Vamsi Krishna joins Janasena):
SVK Jr. College Chairman & YCP MLC Vamsi Krishna Yadav delivered a speech following his resignation from YCP & his decision to join @JanaSenaParty
& mentioned that many big leaders are LOOKING TO JOIN JSP & will try his best to contribute to the party's growth #PawanKalyan pic.twitter.com/f4nxTJBF6r
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) December 27, 2023
ALSO READ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!