WCW 2023 Ind Vs SL: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా గురువారం జరిగిన ఇండియా మరియు శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియా 302 పరుగుల భారి ఆధిక్యంతో విజయం సాధించింది.
అంతేకాదు వరుసగా 7 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం తో పాటు సెమీస్ కి క్వాలిఫై అయిన మొదటి టీం గా టీం ఇండియా నిలిచింది.
ఇండియా: 357-8 / 50ఓవర్లు (విజేత)
శ్రీలంక: 55-10 / 19.4 ఓవర్లు
మ్యాచ్ హైలైట్స్: (India Vs Sri Lanka Match Highlights)
ఈ మ్యాచ్ లో ముందుగా శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బాటింగ్ కు దిగిన ఇండియా నిర్ణీత 50 ఓవర్ లకు 357 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇండియా ఇన్నింగ్స్ లో గిల్ 92 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలవగా, కోహ్లీ 88 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసారు.
శ్రీలంక బౌలర్లలు ప్రత్యర్థి ఇండియా ను భారీ స్కోర్ చేయకుండానే కట్టడి చేయడంలో విఫలం అయ్యారు. లంక బౌలర్లలో మధుసనక 5 వికెట్లు తీయగా… చమీర కు ఒక్క వికెట్ దక్కింది.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది శ్రీలంక. అయితే లక్ష్య ఛేదనలో లంక తడబడింది. ఇండియా ఫాస్ట్ బౌలర్ల్స్ సిరాజ్, బుమ్రా ధాటికి లంక ఓపెనర్లు విలవిలలాడారు. తరువాత బౌలింగ్ కు వచ్చిన షమీ బౌలింగ్ కి లంక బ్యాటర్లు కుదేలయ్యారు. దీంతో కేవలం ౫౫ పరుగులకే చాప చుట్టేశారు.
ఇండియా బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో చెలరేగగా… సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా మరియు జడేజా ఒక్కో వికెట్ తీశారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
మహమ్మద్ షమీ– 5 వికెట్లు 18 పరుగులకి (5 ఓవర్లు)
WCW 2023 IND vs SL:
3️⃣0️⃣2️⃣ పరుగుల భారీ తేడాతో శ్రీలంక పై టీం ఇండియా డామినేటింగ్ విక్టరీ 💥
7 వరుస విజయాలతో సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన టీం ఇండియా 😎ICC Men’s Cricket World Cup | #INDvSL | #StarSportsTelugu | #WorldCupOnStar #CWC23 pic.twitter.com/nel9MZwMN7
— StarSportsTelugu (@StarSportsTel) November 2, 2023
ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?