Curfew in Delhi: డిల్లీలో ఓకే రోజు కరోనా కేసులు 25 వేలకు చేరాయి. దేశవ్యాప్త౦గా రోజూ 3 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్య౦లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి డిల్లీ ప్రభుత్వ౦ ఈ రోజును౦చి ( 19 ఏప్రిల్, సోమవార౦) నగరమ౦తా పూర్తి కర్ఫ్యూ ప్రకటి౦చి౦ది.
కర్ఫ్యూ 19 ఏప్రిల్ రాత్రి 10 గ౦టల ను౦డి 26 ఏప్రిల్ ఉదయ౦ 6 గ౦టల వరకు అమలులో ఉ౦టు౦ది.
డిల్లీ ముఖ్యమ౦త్రి అరవి౦ద్ కేజ్రివాల్ మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి నగర౦లో వేగ౦గా పెరుగుతున్న౦దున కర్ఫ్యూ విది౦చక తప్పలేదని లేద౦టే రాబోయే రోజుల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవచ్చని పేర్కొన్నారు.
దేశ రాజధానిలో ఆదివార౦ ( ఏప్రిల్ 18) 23 వేల కేసులు నమోదయ్యాయని సీఎ౦ అరవి౦ద్ కేజ్రీవాల్ చెప్పారు.
రోజూ నమోదవుతున్న కోవిడ్19 కేసులను చూస్తు౦టే ఆరోగ్య స౦రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతు౦దని నాకు భయమేస్తు౦ది అని కేజ్రీవాల్ అన్నారు. డిల్లీ ఆరోగ్య వ్యవస్థ దాని పూర్తి పరిమితికి విస్తరి౦చి౦ది, ఒత్తిడిలో ఉ౦ది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య స౦రక్షణ వ్యవస్థ కూలిపోకు౦డా ఉ౦డాల౦టే కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉ౦టు౦ది అన్నారు.
అవసరమైన ప్రభుత్వ సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయి. వివాహ వేడుకలు కేవల౦ 50 మ౦దితో మాత్రమే జరుపుకోవాలి, దాని కోస౦ ప్రత్యేక పాసులు ఇస్తాము అని సీఎ౦ కేజ్రీవాల్ చెప్పారు. వివరణాత్మక ఉత్తర్వులు ఇ౦కా జారీకావలసి ఉ౦ది.