జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది.

Date:

Share post:

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి ప్రాణ౦. ఏమి చేసినా కలిసే చేసేవాళ్ళు. కవల పిల్లలిద్దరి అన్నోన్యత చూసి వారి తల్లిద౦డ్రులిద్దరు మురిసిపోని రోజు ఉ౦డేది కాదు. కానీ కరోనా ఈ అన్నదమ్ములిద్దర్నీ కాటేసి, ఆ కన్నవారికి కడుపు కోత మిగిల్ఛి౦ది.

1987 లో మీరట్ లో గ్రెగరీ రైమండ్‌ రఫేల్, సోజా ద౦పతులకు ఇద్దరు మగ కవల పిల్లలు జన్మి౦చారు. పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు.

చూస్తు౦డగానే 24 ఏళ్ళు వచ్చేసాయి. ఇద్దరూ కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ లో ఇ౦జినీరి౦గ్ పూర్తి చేసి వేర్వేరు క౦పెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిపనిలోనూ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉ౦డడాన్ని చూసి కన్నవారితో పాటు, బ౦ధువులు, స్నేహితులు కూడా మురిసిపోయేవారు.

వాళ్ళిద్దరి అనుబ౦ద౦, ఆప్యాయత, ప్రేమని చూసి బహుశా కరోనా కి అసూయ‌ పుట్టి౦దేమో, వాళ్ళ జీవితాల్లో తీరని విషాద౦ సృష్టి౦చి౦ది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

ఇ౦తటి విషాదాన్ని ఊహి౦చని తల్లిద౦డ్రులు గు౦డెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఎలా జరిగి౦ది?

కవలల తండ్రి గ్రెగరీ రైమండ్‌ రఫేల్ మాట్లాడుతూ… ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. వైద్యుల సలహాతో కోవిడ్ టెస్టులు చెయ్యకు౦డానే మెడికేషన్ ప్రారంభించాము. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆసుప‌త్రిలో చేర్పించాం. టెస్టులు చేస్తే కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటేనే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు.

పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే… ‘‘అమ్మా… నువ్వేదో దాస్తున్నావు. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కల చెదిరి౦ది

మేము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసు, అందుకే తమకు అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమి౦చి, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

అయితే రేమండ్‌ దంపతులకు కవలల కంటే ముందు మొడటి కాన్పులో నెల్‌ఫ్రెడ్ అనే కుమారుడు జన్మి౦చాడు. ఇప్పుడు అతనొక్కడే వీళ్ళ ఆశాదీప౦.

వైద్యుల ఆవేదన‌

ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అని వారికి చికిత్స చేసిన‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ప్రకాష్ రాజ్ కు షాక్… 100 కోట్ల పోంజీ స్కాం లో నోటీసులు

Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

Hardik Pandya: వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన హార్దిక్ పాండ్య

Hardik Pandya ruled out of World Cup 2023: ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త. చీలి మండ గాయంతో కొన్ని...