Vishakapatnam Metro Rail Foundation: ఆంధ్రప్రదేశ్ విశాఖ వాసులకు శుభవార్త. రాష్ట్రంలోనే తొలిసారి విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు జనవరి 15న శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, లక్నో మొదలగు నగరాలలో మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసినదే.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖపట్నం అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో తొలి విడత మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’, అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నించి ప్రకటిచడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖపట్నం అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో తొలి విడత మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.… pic.twitter.com/VkZzg2rOUC
— YSR Congress Party (@YSRCParty) September 30, 2023
ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలుత రూ. 9,699 కోట్ల (అంచన) వ్యయంతో 76 కి.మీ లైట్ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగగానే మొత్తం 42 స్టేషన్లతో 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. అయితే ఈలోగా నిధుల సమీకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారిచేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం రాజధానిగా మారబోతున్న తరుణంలో సీఎం జగన్ ఈ ప్రాంత అభివృద్ధి పై ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు గాను… తొలి విడత మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం.
ALSO READ: చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ