YSRTP Withdraws from Telangana Elections 2023: తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో ఉఊగించని షాక్ ని ఇచ్చారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి. ఈ నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి లోనించి తమ పార్టీ తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు.
ఈ విషయాన్ని షర్మిల శుక్రవారం మీడియా తో సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. అంతేకాకుండా రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఈ సమావేశం లో తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చెయ్యట్లేదు (YSRTP Withdraws from 2023 Telangana Assembly Elections):
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయట్లేదు..కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం : వైఎస్ షర్మిల#YSSharmila #YSRTP #Congress #RahulGandhi #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #NTVTelugu pic.twitter.com/AnePoaB6pW
— NTV Telugu (@NtvTeluguLive) November 3, 2023
మీడియా సమావేశం లో షర్మిల మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ అని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ పార్టీకు పడే వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయాన్ని తీస్కుంటున్నట్లు షర్మిల పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని శ్రేణులందరు అర్ధం చేసుకోవాలని షర్మిల కోరారు.
ALSO READ: దొరల తెలంగాణ vs ప్రజల తెలంగాణ : రాహుల్ గాంధీ ట్వీట్