రాష్టంలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం శుక్రవారం వైసీపీ 9వ జాబితాను విడుదల చేసింది (YSRCP 9th In charges list released). ఈ లిస్ట్ లో భాగంగా మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించడం జరిగింది.
ఇందులో…నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ ను వైసీపీ ప్రభుత్వం నియమించడం జరిగింది.
అయితే టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి ఇన్ చార్జిని మార్చింది వైసీపీ ప్రభుత్వం. ముందుగా లోకేష్ కు పోటీగా గంజి చిరంజీవి ప్రకటించిన వైసీపీ… అతని స్థానంలో తాజా లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్య పేరును ప్రకటించింది.
వైసీపీ తొమ్మిదవ జాబితా (YSRCP 9th In charges List Released):
సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా వి.విజయసాయిరెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ నియమిస్తూ లేఖను విడుదల చేసింది… pic.twitter.com/YvUTWfTNQ5
— YSR Congress Party (@YSRCParty) March 1, 2024
ALSO READ:మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి