ICC Mens Cricket World Cup 2023: సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన న్యూజీలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (New Zealand Vs Netherlands) మ్యాచ్ లో న్యూజీలాండ్ 99 పరుగుల తేడాతో ప్రత్యర్థి నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది.
న్యూజీలాండ్ : 323-7/ 50 ఓవర్లు ( విజేత )
నెదర్లాండ్స్ : 223-10/ 46.3 ఓవర్లు
మ్యాచ్ హైలైట్స్: (NZ VS NED HIGHLIGHTS)
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఒడి బాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 323 పరుగులు చేశారు. న్యూజీలాండ్ బ్యాట్సమెన్ లలో విల్ యంగ్ 70 పరుగులు, లేతమ్ 53 పరుగులు మరియు రవీంద్ర 51 పరుగులతో అర్ద శతకాలు చేయగా… మిట్చెల్ 48 పరుగులతో రాణించాడు.
అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ఛేజింగ్ లో చతికిల పడింది. 46.3 ఓవర్లలో కేవలం 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 99 పరుగుల భారీ ఆధిక్యంతో కివీస్ విజయం సాధించింది.
నెదర్లాండ్స్ బ్యాటర్లలో అక్కెర్మన్ 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా… మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. దీంతో వరుసగా రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పరాజయాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది.
ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలం అయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ కు ఐదు వికెట్లు దక్కగా మాట్ హెన్రీ మూడు వికెట్లు… రవీంద్ర ఒక వికెట్ తీసుకున్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
మిచెల్ శాంట్నర్– 36(17); 5 వికెట్లు
New Zealand Vs Netherlands:
– New Zealand beat England by 9 wickets.
– New Zealand beat Netherlands by 99 runs.2 wins in 2 games & Kiwis continues their dominance in World Cup 2023. pic.twitter.com/IfLpMktQXo
— Johns. (@CricCrazyJohns) October 9, 2023
ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?