World Cup 2023: వన్ డే వరల్డ్ కప్ 2023 లోని తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ బోణి కొట్టింది. అహ్మదాబాద్ వేదిక ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (England Vs New Zealand) మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయాన్ని నమోదు చేసుకుని… పాయంట్ల పట్టికలో ఖాతాను తెరిచింది.
ఇంగ్లాండ్: 282-9 / 50ఓవర్లు
న్యూజిలాండ్: 283-1 / 36.2 ఓవర్లు (విజేత)
మ్యాచ్ హైలైట్స్: (England Vs New Zealand Highlights)
ఈ మ్యాచ్ లో ముందుగా న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్ లకు 282 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, కెప్టెన్ బట్లర్ 43 పరుగులు చేసాడు.
అయితే న్యూజిలాండ్ బౌలర్లలు ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ చేయకుండానే కట్టడి చేయగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 3 వికెట్లు తీయగా, స్యాంట్నర్ మరియు ఫిలిప్స్ రెండు రెండు వికెట్లు… బౌల్ట్, రవీంద్ర చెరొక వికెట్ తీసుకున్నారు.
283 పరుగుల లక్ష్యంతో ఓపెనర్లు కాన్వే మరియు యంగ్ తో బరిలోకి దిగింది న్యూజిలాండ్. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ విల్ యంగ్ వికెట్ ను కోల్పోయింది. తరువాత బట్టింగ్ కు వచ్చిన రచిన్ రవీంద్ర … కాన్వే తో పాటు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అంతే కాదు ఇన్నింగ్స్ లో మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఊదేసారు.
శతకొట్టారు: (Conway, Rachin Ravindra Centuries)
వన్ డౌన్ లో బాటింగ్ కు వచ్చిన రవీంద్ర… కాన్వే తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్ లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 273 పరుగుల భాగస్వామ్యం చేకూర్చి జట్టుకి విజయాన్ని అందించారు. కాన్వే 121 బంతుల్లో 152*… రవీంద్ర 96 బంతుల్లో 123* పరుగులతో సెంచరీల మోత మోగించారు.
కేవలం ఒక్క వికెట్:
న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లను నిలువరించే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ లు పూర్తిగా విఫలం అయ్యారని చెప్పాలి. తీసిన ఒక్క వికెట్ కూడా సామ్ కరణ్ కు దక్కింది.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
రచిన్ రవీంద్ర– 123* (96 బంతుల్లో) మరియు ఒక వికెట్.
ICC Cricket World Cup 2023: (ENG Vs NZ 1st ODI)
So if you're playing against England this WC win the toss and bowl first cos Eng hate defending 😛 Terrific partnership between Conway and Rachin, well played NZ 👏🏽 #ENGvNZ #CWC23 pic.twitter.com/OiCthFBPW9
— Wasim Jaffer (@WasimJaffer14) October 5, 2023
Two quickfire hundreds from Rachin Ravindra and Devon Conway helped New Zealand to a comfortable win in the #CWC23 opener 👊#ENGvNZ 📝: https://t.co/9XyPD7lF90 pic.twitter.com/qR6tnjQLGB
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023
ALSO READ: ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?