తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (TSPSC Chairman Mahendar Reddy) శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. తదుపరి సభ్యులుగా పాల్వాయి రజినీకుమారి, అనితా రాజేంద్రతో మహేందర్ రెడ్డి ప్రమాణం చేయించినట్లు సమాచారం.
ఇకపోతే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.
అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీక్‌లు మరియు పరీక్షల రద్దుపై జరిగిన వివాదాల తరువాత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని పునర్నిర్మించాలని ప్రతిజ్ఞ చేసింది. అలాగే చైర్మన్ మరియు సభ్యులతో పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరడం జరిగింది.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి (TSPSC Chairman Mahendar Reddy):
TSPSC ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి.#Telangana #TSPSC #Chairman #mahendarreddy#BREAKING #LatestNews #TeluguNews #ChotaNewsTelugu pic.twitter.com/rLN8h7qvvw
— ChotaNews (@ChotaNewsTelugu) January 26, 2024
ALSO READ: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటిఆర్