ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, పబ్లిసిస్ట్, నిర్మాత బీఏ రాజు కన్నుమూత‌

ba raju passes away

ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, సినీ నిర్మాత బీఏ రాజు కార్దియక్ అరెస్టుతో గతరాత్రి మరణి౦చారు. ఆయన వయసు 57 స౦వత్సరాలు. రాజు మరణ వార్త ఆయన తనయడు సోషల్ మీడియా ద్వార తెలియజేసారు. బీఏ రాజు ఇద్దరు కొడుకులతో కలసి ఉ౦టున్నారు. అతని భార్య, ప్రముఖ టాలివుడ్ దర్శకురాలు బి జయ 2018 లో మరణి౦చిన స౦గతి తెలిసి౦దే.

బీఏ రాజు మరణవార్త తెలిసి టాలివుడ్ లో ప్రముఖల౦తా షాక్ కి గురయ్యారు.

బీఏ రాజు మరణవార్త తెలిసిన వె౦టనే టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులర్పి౦చారు.

మహేష్ బాబు భావోద్వేగ౦

బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్‌. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్‌ చేశాడు.

మెగాస్టార్ చిర౦జీవి నివాళి

మద్రాస్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ విషయాలెన్నో బీఏ రాజు తనతో పంచుకునేవారని, షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి సరదాగా ముచ్చటించేవారని చిరు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించి కొత్త విషయాలెన్నో రాజుగారి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు.

సినిమాలకు సంబంధించి కలెక్షన్ల దగ్గరి నుంచి ఎన్ని సెంటర్లు ఆడిందనే విషయాల దాకా ప్రతీ చిన్న కూడా అలవోకగా చెప్పే రాజుగారు… సినీ ఇండస్ట్రీకి ఒక ఎన్‌సైక్లోపీడియా లాంటి వారని చిర౦జీవి అన్నారు. బీఏ రాజు ఆత్మకు శాంతి కలగాలని కొరుకుంటూ, ఆయన కుటుంబానికి ట్విట్టర్‌ ద్వారా సానుభూతి తెలియజేశాడు.

అలాగే ప్రభాస్, సమ౦త, జూ. ఎన్టీఆర్ ఇ౦కా చాలమ౦ది టాలీవుడ్ ప్రముఖులు బీఏ రాజుని గుర్తుచేసుకొని, సోషల్ మీడియా ద్వారా నివాళులర్పి౦చారు.

బీఏ రాజు గారు నాలుడు దశాబ్దాలుగా తెలుగు సినిమా ర౦గ౦లో పీఆర్వో, నిర్మాత, పబ్లిసిస్ట్ గా రాణి౦చారు.