ముంబయి ఎయిర్ పోర్టులో సుమారు రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది (Thailand woman arrested at Mumbai airport and cocaine worth Rs 40 crores seized). ఓ థాయ్ మహిళ నుంచి రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెల్సుతోంది.
కొకైన్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 21 ఏళ్ల థాయ్ మహిళను అధికారులు ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె లగేజీని పరిశీలించగా…తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్ లో నుంచి బయటపడినట్లు మీడియా సమాచారం.
అలా లభించిన ప్యాకెట్లను పరీక్షించగా కొకైన్ అని నిర్దారించబడింది. పట్టుబడిన ఈ కొకైన్ విలువ సుమారు రూ. 40 కోట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు కొకైన్ అక్రమ రవాణా పాల్పడిన మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ముంబై ఎయిర్పోర్ట్లో కొకైన్ పట్టివేత (Thai Woman arrested with Cocaine at Mumbai Airport):
Maharashtra | A 21-year-old woman of Thailand nationality was arrested at Mumbai airport and cocaine worth Rs 40 crores in the international market was seized from her luggage. She was arrested under NDPS Act. The woman had travelled from Addis Ababa: Directorate of Revenue…
— ANI (@ANI) January 12, 2024
ALSO READ: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి