తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధా క్రిష్ణన్ కు అదనపు బాధ్యతలు (Telangana Governor CP Radha Krishnan) అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కారణంగా రెగ్యులర్ గవర్నర్లను నియమించే పరిస్దితి లేకపోవడంతో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్ (Telangana Governor CP Radha Krishnan):
తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ pic.twitter.com/SPNSRQJZ3h
— V6 News (@V6News) March 19, 2024
ALSO READ: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా