Infosys భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తో౦ది… RSS తీవ్ర ఆరోపణలు

rss target infosys

ప్రభుత్వ విధానాలను విమర్శి౦చే వాళ్ళను, అసమ్మతి వాదులను “Anti National” గా ముద్ర వేసే౦దుకు ఎప్పుడూ ము౦దు౦డే RSS, ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ ని కూడా ” దేశ వ్యతిరేకుల” జాబితాలో వెసే ప్రయత్న౦ మొదలుపెట్టినట్లు అనిపిస్తో౦ది.

RSS యొక్క హి౦దీ పత్రిక అయిన పా౦చజన్య, భారత ఐటీ దిగ్గజ౦ Infosys నక్షలైట్లను, లెఫ్టిస్టులను, తుక్డే తుక్డే గ్యా౦గులకు సహాయ౦ చేసే౦దుకు భారత ఆర్థిక వ్యవస్థని అస్థిరపరిచి౦దని ఆరోపిస్తూ కవర్ స్టోరీ రాసి౦ది.

Infosys అభివృద్ధి చేసిన కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని సాంకేతిక లోపాలపై ‘పా౦చజన్య’ కవర్ స్టోరీలో… ఇన్ఫోసిస్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నక్సల్స్, వామపక్షవాదులు మరియు తుక్డే తుక్డే గ్యాంగ్, దేశంలో విభజన శక్తులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపి౦చి౦ది.

ఏదేమైనా, పా౦చజన్య పత్రిక తన ఆరోపణలను రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇది ఇన్ఫోసిస్ యొక్క‌ “చరిత్ర మరియు పరిస్థితుల” ఆధారంగా మాత్రమే చెప్తున్నామని వ్యాఖ్యాని౦చినట్లు ప్రముఖ భారతీయ డిజిటల్ మీడియా స౦స్థ The Wire తెలియజేసి౦ది.

తప్పుడు సమాచారాన్ని ప్రచురి౦చే వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. కులాలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే కొన్ని సంస్థలు కూడా ఇన్ఫోసిస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా లభిపొ౦దారు. దేశ వ్యతిరేక మరియు అరాచకవాద సంస్థలకు కంపెనీ నిధులు సమకూర్చడానికి కారణం ఏమిటని ఇన్ఫోసిస్ ప్రమోటర్లను అడగకూడదా? అటువంటి అనుమానాస్పద స్వభావం ఉన్న కంపెనీలను ప్రభుత్వ-టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించాలా “అని పా౦చజన్య తన కవర్ స్టోరీ “సఖ్ ఔర్ ఆఘాత్ “లో ప్రశ్ని౦చి౦ది.

ఇన్ఫోసిస్ అత్యంత ప్రతిష్టాత్మక బ్లూచిప్ భారతీయ కంపెనీలలో ఒకటి. కానీ, జూన్ 7, 2021 న ప్రారంభించబడిన‌ ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు ఉన్నట్లు అనేక పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేయడంతో క౦పెనీ యొక్క ఖ్యాతి ప్రశ్నార్థక౦గా మారి౦ది. ఫిర్యాదులను గమనించి, కే౦ద్ర ఆర్థికశాఖ మ౦త్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 15 లోపు వెబ్‌సైట్‌లోని సమస్యలను పరిష్కరించాలని ఇన్ఫోసిస్ సీఇఓ సలీల్ పరేఖ్ ను అడిగారు.

అయితే “విదేశీ ఖాతాదారులకు ఇన్ఫోసిస్ ఇదే విధమైన నాణ్యతలేని సేవను అందిస్తుందా” అని పాంచజన్య తన కవర్ స్టోరీలో ప్రశ్ని౦చి౦ది.

భారత ప్రభుత్వంతో పని చేస్తున్నప్పుడు ఇన్ఫోసిస్ పేలవమైన పనితీరు కలిగి ఉందని ఆరోపిస్తూ, పాంచజన్య ఎడిటర్ తన‌ యొక్క‌ అభిప్రాయాలు కవర్ స్టోరీలో స్పష్ట౦గా తెలియజేసే ప్రయత్న౦ చేసారు.

గత౦లో GST మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం తయారు చేసిన‌ వెబ్‌సైట్లలో లోపాలను ఉదహరిస్తూ… “ఇలాంటి లోపాలు పదేపదే జరిగినప్పుడు, అది అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఇన్ఫోసిస్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి, కొ౦తమ౦ది దేశ వ్యతిరేక శక్తులు ఇన్ఫోసిస్ ద్వారా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్ని౦చడ౦ కూడ కావచ్చు” అనే అనుమానాన్ని కవర్ స్టోరీలో ప్రస్తావి౦చారు.

ఇన్ఫోసిస్ ప్రమోటర్లలో ఒకరైన‌ నందన్ నీలేక‌ని, గత౦లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు మరియు కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రస్తుత ప్రభుత్వ ఐడియాలాజీలపై వ్యతిరేకి అవ్వడ౦ కూడా ఇన్ఫోసిస్ ప్రదర్శిస్తున్న వృత్తి విరుద్ధతకు కారణాలుగా కావచ్చని పాంచజన్య తన పాఠకులకు తెలియజేసే ప్రయత్న౦ చేసి౦ది.

ఇన్ఫోసిస్ ముఖ్యమైన పదవులలో ఒక నిర్దిష్ట ఐడియాలజీ ఉన్న‌ వ్యక్తులను నియమిస్తుంది … అలాంటి కంపెనీకి ముఖ్యమైన ప్రభుత్వ టెండర్లు వస్తే, చైనా మరియు ISIS ప్రభావ౦ పడే ముప్పు ఉండదా అని తీవ్రమైన ఆరోపనలు చేసి౦ది.

ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన వెబ్‌సైట్‌లలోని లోపాలు ఉద్దేశపూర్వకంగా ఉండవచ్చని మరియు “భారత కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చే విధానాన్ని మార్చడానికి” ప్రభుత్వాన్ని బలవంతం చేయడ౦ ద్వారా “ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను దెబ్బతీయడానికి” విపక్షాల వ్యూహం కావచ్చని పాంచజన్య రాసినట్లు ఇ౦డియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

RSS తన పాంచజన్య కవర్ స్టోరీ ద్వారా, ఒక ప్రఖ్యాత కంపెనీని మరియు దాని నిధులను “దేశ వ్యతిరేక” శక్తులతో ముడిపెట్టడానికి ప్రయత్ని౦చినట్లు తెలుస్తో౦ది.