బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party). బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరగా… ఆయనకు కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీఆరెస్ వ్యవస్థాపకులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా… బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తుకు తమ (BSP) అధినేత్రి మాయావతి అంగీకరించకపోవడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పష్టం చేశారు. అంతేకాకుండా బలమైన తెలంగాణ వాదానికి, బహుజన వాదం తోడైతే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే అభిప్రాయంతోనే పొత్తు కుదుర్చుకున్నాం అని అన్నారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమి లేదు. ఈ ఎన్నికలతో ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది అని అన్నారు. మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar Joins BRS Party):
With the blessings of Sri KCR garu, I have joined Bharatha Rastra Samithi (BRS) today. Hoping for an impactful journey ahead.
ఈ రోజు నాకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీఆరెస్ వ్యవస్థాపకులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. pic.twitter.com/FZjoGTi67B— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 18, 2024
ALSO READ: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా