Janasena TDP Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి పనిచేస్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రేమండ్ ఖైదీ గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. పవన్ తో పాటు నందమూరి బాలకృష్ణ మరియు నారా లోకేష్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లరు.
ప్రకటనలో భాగంగా పవన్ మీడియా తో మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలనా కొనసాగుతోందని…ఈ అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుని రేమండ్ కి పంపించారు అని విమర్శించారు.
తాను తీసుకున్న నిర్ణయం ‘మా ఇద్దరి భవిష్యత్తుకి సంబందించినది కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబందించినది’ అని జనసేన అధినేత తెలియజేయడం జరిగింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి – జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు #TDPJSPTogether#APvsJagan#IAmWithBabu #PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/nqCKOcQIjM
— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023
నారా లోకేష్, నందమూరి బాలకృష్ణగార్లతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేతను కలిసి వచ్చిన అనంతరం… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు గారి అరెస్ట్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి… pic.twitter.com/CqSySnQOiv
— Telugu Desam Party (@JaiTDP) September 14, 2023
అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామజిక మాధ్యమాల్లో మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
విచారణ లేకుండా జైల్లో ఎలా?
స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబుని జైల్లో ఉంచడం బాధాకరమని, అసలు విచారనే లేకుండా ఎలా జైల్లో కుర్చో పెడతారు అని పవన్ ప్రశ్నించారు.
ఆరు నెలలే జగన్ :
జగన్ నీకు కేవలం ఆరు నెలలు మార్త్రమే ఉంది. ఆరు నెలలు తరువాత జగన్ మద్దత్తుదారులు ఎవరైనా సరే, మీరు యుద్ధమే కావాలనుకుంటే… మీకు యుద్ధమే ఇస్తాము అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
సొంత అమ్మని సొంత అక్కని వదిలేసినా వ్యక్తి జగన్ అని. బాబాయ్ చనిపోతే వాళ్ళని వెనకేసుకొస్తున వ్యక్తి… అధికారులని ఎలా వెనకేసుకుని వస్తాడు అనుకుంటారు అని పవన్ ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ ని నమ్ముకొని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే అధికారులకి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ ని నమ్ముకొని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే అధికారులకి ఇదే చెప్తున్నాను..
మీకు యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం,
– @PawanKalyan గారు#HelloAP_ByeByeYCP #janasenaparty #PawanaKalyan pic.twitter.com/P5SJbOkLxA— ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚 (@PnHarini) September 14, 2023
వై.స్.ఆర్.సీ.పీ పార్టీ ట్వీట్:
“ప్యాకేజ్ బంధం బయటపడింది”
నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDP తో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం, అని వై.స్.ఆర్.సీ.పీ ట్వీట్ చేసింది.
“ప్యాకేజ్ బంధం బయటపడింది”
నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb
— YSR Congress Party (@YSRCParty) September 14, 2023
ALSO READ: చంద్రబాబు అరెస్ట్: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన