WC 2023 PAK VS NED: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇవాళ అక్టోబర్ 6న పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ (Pakistan Vs Netherlands) పోటీ పడ్డాయి. ఈ వన్ డే మ్యాచ్ లో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది.
పాకిస్తాన్: 286-10 / 49 ఓవర్లు (విజేత)
నెదర్లాండ్స్: 205-10 / 41 ఓవర్లు
హైలైట్స్: (PAK Vs NED Highlights)
ఈ మ్యాచ్ల్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 205 పరుగులకు కుప్పకూలింది. దీంతో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ల్ లో విజయకేతనం ఎగరవేసింది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్:
38 కి మూడు:
ఓపెనర్లు ఇమాం-ఉల్-హాక్ మరియు ఫకర్ జమాన్ తో బరిలోకి దిగిన పాక్ కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఊహించని ఎదురు దెబ్బె తగిలింది. ఓపెనర్ గా వచ్చిన ఫకర్ జమాన్ 15 బంతుల్లో కేవలం 12 పరుగులు చేసి అవుట్ అవ్వగా… వన్ డౌన్ లో బాటింగ్ కు వచ్చిన కెప్టెన్ బాబర్ 5 (18 బంతుల్లో) అలాగే మరొక ఓపెనర్ ఉల్ హాక్ 15 (19 బంతుల్లో) కూడా వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో 38 పరుగులకే మూడు వికెట్ కోల్పోయి పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
120 పరుగుల భాగస్వామ్యం:
ఈ క్రమంలో బాటింగ్ కు వచ్చిన షకీల్…రిజ్వాన్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరూ నాలోగో వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నిలకొల్పారు. జట్టు 158 పరుగుల వద్ద షకీల్ 68 (52 బంతుల్లో) వికెట్ కోల్పోయిన పాకిస్తాన్… మరి కొద్దీ పరుగులకే రిజ్వాన్ 68 (75 బంతుల్లో) ను కూడా కోల్పోయింది. ఆ వెంటనే వచ్చిన అలరౌండ్ర్ ఇఫ్తికార్ కూడా తక్కువ స్కోర్ కి వెనుతిరిగాడు.
శ్రమించిన నెథర్లాండ్స్ బౌలర్లు:
బౌలింగ్ విభాగంలో నెదర్లాండ్స్ మంచి ప్రదర్శనే కనపరిచారు. పాకిస్తాన్ టాప్ బ్యాట్స్‌మెన్ లను కట్టడి చేయడంలో నెదర్లాండ్స్ బౌలర్ల ప్రయత్నాలు ఫలించాయి. అయితే లోయర్ ఆర్డర్ ను కట్టడి చేయడంలో కొంచెం కష్ట పడాల్సి వచ్చింది. పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ తో నవాజ్ 64 పరుగుల పార్టనర్ షిప్ ను అందించి అవుట్ అయ్యారు. తరువాత వచ్చిన బ్యాటర్లు ఇన్నింగ్స్ కు కోసం మెరుపులు దిద్దారు.
ఇన్నింగ్స్ ముగిసే సమయానికి పాక్ 286 పరుగులు చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో షకీల్ (68), రిజ్వాన్ (68), నవాజ్ (39), షాదాబ్ (32) మినహా ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
నెదర్లాండ్స్ బౌలర్ లో బాస్ డి లీడే నాలుగు వికెట్లు తీయగా… అక్కెర్మన్ కు రెండు వికెట్లు… మీక్రీన్, దత్, బీకే చెరొక వికెట్ తీసుకున్నారు.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్:
అనంతరం 287 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగింది నెదర్లాండ్స్. అయితే పాక్ మాదిరి గానే నెదర్లాండ్స్ కూడా ఆదిలోనే తొలి వికెట్(ఒదౌడ్)ను పోగొట్టుకుంది. తరువాత బాటింగ్ కు వచ్చిన అక్కెర్మన్… ఓపెనర్ విక్రంజీత్ సింగ్ తో కొద్దీ సేపు పాక్ బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అక్కెర్మన్ 17 పరుగుల వద్ద, ఇఫ్తికార్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
ఒక పక్క వికెట్లు పడుతున్నా విక్రంజీత్ మాత్రం నిదకడగా ఆడుతూ అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు 67 బంతోలో 52 పరుగులు చేసిన విక్రంజీత్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
విక్రంజీత్ వికెట్ తో నెదర్లాండ్స్ తీవ్ర ఓతోడిలో పడింది. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లను (తేజ, స్కాట్ ఎడ్వర్డ్స్) తీసిన హరీష్ రాఫ్ నెదర్లాండ్స్ ను కోలుకోలేని దెబ్బతీసాడు.
బాస్ డి లీడే ఒంటరి పోరు:
ప్రత్యర్థి బౌలర్లు వికెట్లు పడగొడుతున్న బాస్ డి లీడే మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చాడు. తన సహచరుల నుంచి సాయం అందకపోయినా పోరాట స్ఫూర్తిని కోల్పోలేదు. అయితే 68 బంతులతో 67 ఒరుగులు చేసిన లీడే చివరికి నవాజ్ బౌలింగ్ లో దొరికిపోయాడు. లీడే వికెట్ తో నెదర్లాండ్స్ జట్టు గెలుపు ఆశలు గల్లంతయ్యాయి.
దీంతో పాక్ బౌలర్లకు ఊరట లభిందింది. ఇక టెయిలెండర్ల వికెట్లు తీయడం పాక్ బౌలర్ల కు సులభంతరం గా మారిపోయింది. నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాక్ బౌలర్లలో రాఫ్ మూడు వికెట్లు తీయగా… హాసన్ అలీ రెండు వికెట్లు తీశారు. ఇకపోతే ఆఫ్రిది ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ లకు తలొక వికెట్ సాధించారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
సౌద్ షకీల్– 68 పరుగులు 52 బంతుల్లో
ట్వీట్:
A clinical display with the ball helped Pakistan to a big win against Netherlands in their opening #CWC23 encounter 👊#PAKvNED 📝: https://t.co/I94RCzNfEa pic.twitter.com/LNI7kaXF6S
— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2023
ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?