Nandamuri Balakrishna Comments on Jagan Government: స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేసి అరెస్టు చేశారు అని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని కేవలం కుట్ర సాధింపు చర్యగానే అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు అన్నారు. ‘వేల మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా’ అని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా ? ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని అన్నారు.
ఎవ్వరు భయపడాల్సిన పని లేదు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది… కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదు… నేను వస్తున్న, ఎవ్వరు భయపడాల్సిన పనే లేదు. తెలుగువాడి సత్త పౌరుషం ఏంటో చూపిద్దామని అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
No need to be afraid of anyone, I am coming & will lead from the front; we will show strength & valour of #Telugus, says actor-politician & @JaiTDP MLA #Nandamuri #Balakrishna, who is brother-in-law of former #AndhraPradesh CM @ncbn & father-in-law of @naralokesh @ndtv @ndtvindia pic.twitter.com/HJVTh1swNr
— Uma Sudhir (@umasudhir) September 12, 2023
చంద్రబాబు కడిగిన ముత్యం:
సీఎం జగన్ పై ఎన్నో కేసులు ఉన్నాయ్… అయినా బయట తిరుగుతున్నారు. కేవలం రానున్న ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. అంతే కాకుండా జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నారు…చంద్రబాబును కనీసం పదారు రోజులైనా జైల్లో ఉంచాలనే ఈ కుట్ర చేశారన్నారు.
అలాగే ఇలాంటివి ఎన్నో చూసాం అని… ఎవరికి భాపడం అని… తమ న్యాయపోరాటం కొనసాగిస్తాం అని… చంద్రబాబు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
జగన్ పైన బాలకృష్ణ పద్యం:
జగన్ పాలన పద్యం రూపంలో పాడిన బాలయ్య : Balakrishna Sensational Comments | Chandrababu Case – TV9#balakrishna #chandrababuarrest #tv9telugu pic.twitter.com/EiAIOHr1SF
— TV9 Telugu (@TV9Telugu) September 12, 2023
ALSO READ: ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్