ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name misuse). ఈ మధ్యకాలం లో తన పేరును కొంత మంది రాజకీయంగా వాడుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింది అని మోహన్ బాబు అన్నారు.
ఈ మేరకు మోహన్ బాబు తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతా ద్వారా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది.
ఈ లేఖలో… ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొంత మంది ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది అని మోహన్ బాబు అన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను (Mohan Babu warns politicians for misusing his name) అని తెలిపారు.
మనం అనేక భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని.. ఎవరి అభిప్రాయాలు వారివని, అది వారి వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని రాసుకొచ్చారు.
నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నానని… తన విన్నపాన్ని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు హెచ్చరించారు.
మోహన్ బాబు వార్నింగ్ (Mohan Babu issues Warning on his name misuse):
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024