IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో (MI vs KKR) కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం (KKR beat MI by 24 Runs) సాధించింది.
తొలుత బ్యాట్టింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్టింగ్ ను ఆరంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోతూ పీకల్లోతు కష్టాలలో పడింది. కేవలం 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ను వెంకటేష్ అయ్యర్ (70) మరియు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పండేయ్ (42) జట్టును ఆదుకున్నప్పటికీ … తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన ప్లేయర్స్ సరైన భాగస్వామ్యం అందించకపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
౧౭౦ పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్… ఓపెనర్లు ఇషాన్ కిషన్ ౧౩ రోహిత్ ౧౧ విఫలం అయ్యారు. ఇక తరువాత వచ్చిన బ్యాటర్లను కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అయితే ఒక పక్క వికెట్ లు పడుతున్న సూర్య కుమార్ యాదవ్ (56) మరియు డేవిడ్ (24), జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు ప్రయత్నం జట్టుకి విజయాన్ని అందించలేకపోయింది. దీంతో 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ముంబై అల్ అవుట్ అయ్యి ఓటమి పాలయింది.
ఈ మ్యాచ్లో విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ౧౪ పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా… ముంబై ఇండియన్స్ కేవలం ౬ పాయింట్లతో తోమిడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ల్లో ఓటమితో ముంబై ఇండియన్స్ కు ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు కోల్పోయినట్టే.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: వెంకటేష్ అయ్యర్
కోల్‌కతా విజయం (KKR beat MI by 24 runs):
KKR DEFEATS MUMBAI INDIANS FOR THE FIRST TIME IN 12 YEARS AT THE WANKHEDE STADIUM. 🤯🔥 pic.twitter.com/D7IMwpCAD1
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2024
ALSO READ: IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం