Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

Date:

Share post:

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత కొంతకాలంగా టవర్ చుట్టూ వివాదం నెలకొన్న విషయ౦ తెలిసి౦దే.

ది ఇ౦డియన్ ఎక్శ్ప్రెస్ నివేదిక ప్రకార౦… నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను జనవరి 26న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరిగింది.

మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ… వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామన్నారు. గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

PTI నివేదిక ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

అయితే ఈ అంశాన్ని లేవనెత్తినందుకు బీజేపీ సభ్యుడిపై ముస్తఫా మండిపడ్డారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే బదులు కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిరుపేదలకు సహాయం చేయడంలో బీజేపీ నాయకులు పాల్గొనాలి” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.

గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు ఉన్న౦దున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే ముస్తఫా, జీఎంసీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో కలిసి మంగళవారం స్మారక చిహ్నాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

Viral Video: అమెజాన్ ఆర్డర్ లో పాము… షాక్ అయిన కస్టమర్

అమెజాన్ లో ఆర్డర్‌ చేసిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary...