Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

Date:

Share post:

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని నిలబడగలగడం. అయితే ఇరాన్‌ను పూర్తిగా స్వయంపూర్తి దేశంగా చెప్పలేము, కానీ అది పాక్షికంగా (Is Iran a self-reliant economy) దేశంగా చెప్పవచ్చు.

ఇరాన్ ఈ దిశగా ప్రయాణించడం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ముఖ్య కారణం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ప్రపంచ మార్కెట్లతో స్వేచ్ఛగా వాణిజ్యం చేయలేకపోయింది. ఈ పరిస్థితి దేశాన్ని అంతర్గత వనరులపై ఆధారపడేలా మార్చింది.

ఇరాన్ యొక్క ఆత్మనిర్భర్ (Iran Atmanirbhar) విధానం అమెరికా–ఇజ్రాయెల్‌తో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తున్న సందర్భంలో, ఇరాన్ తన స్వదేశంలో అభివృద్ధి చేసుకున్న సైనిక శక్తితో సమర్థంగా ప్రస్పందిస్తోంది అనే చెప్పాలి.

ముఖ్యంగా, మిస్సైల్‌లు మరియు డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగించి ప్రతిదాడులు జరపడం ద్వారా, తన రక్షణ వ్యవస్థలో ఉన్న స్వయం ఆధారితతను ప్రదర్శిస్తోంది.

ఇరాన్ ఎందుకు Self-reliant కావాల్సి వచ్చింది?

మీడియా సమాచారం ప్రకారం… అమెరికా మరియు పశ్చిమ దేశాలు ఇరాన్‌పై చాలా కాలంగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ యొక్క విదేశీ వ్యాపారం తగ్గింది. అలాగే బ్యాంకింగ్, డాలర్ లావాదేవీలు కష్టమయ్యాయి. అందుకే ఇరాన్ “Resistance Economy” అనే విధానాన్ని అమలు చెప్పటినట్లు తెలుస్తోంది.

ఇరాన్ ఎక్కడ Self-reliant గా ఉంది (Where Iran is relatively self-reliant)?

మీడియా సమాచారం మరియు వార్తా కథనాల ప్రకారం…

1. ఎనర్జీ

ఎనర్జీ రంగంలో ఇరాన్ గణనీయమైన ఆత్మనిర్భర్ (స్వయంపూర్తి)ని సాధించింది. చమురు మరియు సహజ వాయువు వంటి విస్తారమైన వనరులు ఉన్నందున, దేశీయ అవసరాలను తానే తీర్చుకోవడమే కాకుండా, కొంతమేరకు ఎగుమతులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే విద్యుత్ ఉత్పత్తి మరియు పెట్రోకెమికల్ రంగాల్లో కూడా ఇరాన్ స్వయం సమృద్ధిని పెంపొందించింది.

2. తయారీ రంగం (Manufacturing)

విదేశీ ఉత్పత్తుల కొరత కారణంగా ఇరాన్… దేశీయంగా యంత్రాలు, వాహనాలు మరియు ఇతర వస్తువుల తయారీ పై ప్రతేయక శ్రద్ద పెట్టింది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరాన్ గణనీయమైన పురోగతిని సాధించింది అనే చెప్పొచు.

3. పెట్రోకెమికల్ & ఇంధన ఉత్పత్తి

ఇరాన్ దేశం పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తానే తయారు చేసుకుంటుంది. అలాగే కొంతవరకు ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నట్లు సమాచారం.

♦ ఇరాన్ ఆత్మనిర్భర్ లేని రంగాలు (Where Iran is not self-reliant):

1. ఆహార భద్రత

అయితే ఇరాన్ పూర్తిగా ఆత్మనిర్భర్ దేశం అని చెప్పడం సరైనది కాదు. ఆహార భద్రత విషయంలో ఇరాన్ ఇంకా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇకపోతే నీటి కొరత మరియు భౌగోళిక పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

2. టెక్నాలజీ (Technology)

అదేవిధంగా… ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇరాన్ ఇంకా వెనుకబడి ఉంది. అలాగే అధునాతన యంత్రాలు మరియు టెక్నాలజీ కోసం ఇతర దేశాల సహాయం అవసరం అవుతోంది.

3. ఆర్థిక వ్యవస్థ

అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఇరాన్ చమురు మీద అధికంగా ఆధారపడటం వల్ల స్థిరత్వ సమస్యలు ఎదుర్కొంటోంది. ఆంక్షల వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయి.

ముగింపు (Conclusion):

మొత్తానికి, ఇరాన్ పూర్తిగా స్వయంపూర్తి సాధించలేకపోయినప్పటికీ, ముఖ్య రంగాల్లో స్వయం ఆధారిత దేశంగా నిలిచింది అనే చెప్పాలి. అయితే భవిష్యత్తులో పూర్తి ఆత్మనిర్భర్ స్థితిని సాధించాలంటే, ఇరాన్ టెక్నాలజీ, వ్యవసాయం మరియు ఆర్థిక విభిన్నీకరణపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ALSO READ: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి… సుమారు 400 మంది మృతి

ఆఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. 2026, మార్చ్ 16 న కాబూల్ నగరంలో ఒక పెద్ద డ్రగ్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌ పాక్ నటి సనా జావెద్‌ను...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం...

లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40...