ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం (SRH beat RR by 1 Run) సాధించింది.
ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత హైదరాబాద్ బ్యాటర్లు ఇన్నింగ్స్ ను నిమ్మదిగా మొదలు పెట్టినప్పటికీ ఓపెనర్ గా వచ్చిన హెడ్ 58 పరుగులు, నితీష్ రెడ్డి 76 పరుగులు అలాగే చివరిలో వచ్చిన క్లాసీన్ 42 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బట్లర్ ౦ లగే తరువాత వచ్చిన సంజు సాంసన్ ౦ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలిన బాట పట్టారు. దీంతో రాజస్థాన్ కష్టాలలో పడింది. కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాను యశస్వి జైవాల్ మరియు రియాన్ పరాగ్ ఆదుకున్నారు. వీరిద్దరు జైస్వాల్ 67, పరాగ్ 77 పరుగులు చేయడంతో ఒక తరుణంలో జట్టు విజయం కాయంగానే కనిపించింది.
అయితే జట్టు 135 పరుగుల వద్ద జైస్వాల్ అవుట్ కావడం… మరి కొద్ది పరుగులకే పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. 159-4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కు పోవెల్ మరియు హెట్మేయెర్ మెరుపులు మెరిపించి జట్టుకి విజయం లాంచనంగా మార్చారు. దీంతో రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్ లో 13 పరుగులు కావాలి. అయితే హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కనైన బౌలింగ్ తో హైదరాబాద్ కు అనూహ్య విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ల్లో విజయంతో హైదరాబాద్ 12 పాయింట్లతో నాలుగో స్థాననికి ఎగబాకాగా.. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మొదటి స్థానంలో స్థిరంగా ఉంది.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్
హైదరాబాద్ విజయం (SRH beat RR by 1 Run):
BHUVNESHWAR KUMAR – THE HERO OF SRH…!!! 🫡
RR needed 13 in 6 balls – 1,2,4,2,2,W to win it for SRH by 1 run. A crazy match in Hyderabad. 🤯💥 pic.twitter.com/61tMRLa2RW
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2024
ALSO READ: IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం