IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను (LSG beat MI by 4 wickets) ఓడించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ లు కోల్పోయి కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో వధేరా 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా… ఇషాన్ కిషన్ 32 పరుగులు, డేవిడ్ 35 పరుగులు మినహా మిగిలిన వాళ్ళు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
లక్నో బౌలెరలో మొహసిన్ ఖాన్ రెండు వికెట్ లు తీసుకోగా… స్టోనిస్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్, నవీన్ ఉల్ హాక్ చెరొక వికెట్ తీసుకుని ప్రత్యర్థి ముంబై ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలిగారు.
అనంతరం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన 19.2 ఓవర్లలో ఆరు వికెట్ లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టోయినిస్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా… రాహుల్ 28 పరుగులు, హూడా 18 , పూరన్ 14 పరుగులతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో విజయంతో లక్నో సూపర్ గైన్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాగా… ముంబై ఈ మ్యాచ్ ఓటమితో ఆరు పాయింట్లతో తోమిదవ స్థానంలో నిలిచింది.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్ : స్టోయినిస్
లక్నో విజయం (LSG beat MI by 4 wickets):
LUCKNOW SUPERGIANTS DEFEATED MUMBAI INDIANS IN LUCKNOW. 💥 pic.twitter.com/94HRrmZU5D
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2024
ALSO READ: IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు