IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం (KKR beat SRH by 8 wickets and enter final) సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో నేరుగా ఫైనల్స్ బెర్తును కోల్‌కతా ఖరారు చేసుకుంది.
ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోల్‌కతా. అయితే బ్యాట్టింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉఊహించని షాక్ తగిలింది. ఓపెనర్స్ హెడ్ మరియు అభిషేక్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. తరువాత బ్యాట్టింగ్ కు దిగిన త్రిపాఠి హైదరాబాద్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన… తనకు మరో పక్క నుంచి సహకారం అందలేదు.
దీంతో 37 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడిన హైదరాబాద్ ను త్రిపాఠి మరియు క్లాసీన్ కాసేపు ఆదుకున్నారు. త్రిపాఠి (35 బంతులతో 55పరుగులు చేయగా) క్లాసీన్ (21 బంతులతో 32 పరుగులు) చేసి జట్టును ఆదుకునపటికి… వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో 127 పరుగులకే హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యట్టింగ్ కు వచ్చిన కెప్టెన్ కమ్మిన్స్ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించి అవుట్ అయ్యాడు. దీంతో 19.3 ఓవర్లలో హైదరాబాద్ 159పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది.
160 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన కోల్‌కతా… ప్రత్యర్థి హైదరాబాద్ బౌలర్ లకు చుక్కలు చూపించారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేష్ ఇయర్ (58) శ్రేయాస్ ఇయర్ (51) పరుగులతో ఆకట్టుకుని జట్టుకి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ల్లో విజయంతో కోల్‌కతా నేరుగా ఫైనల్స్ చేరుకుంది.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: స్టార్క్
ఫైనల్ కు కోల్‌కతా(KKR beat SRH and Enter IPL 2024 final)
KKR ARE IN THE FINAL OF IPL 2024. 🏆 pic.twitter.com/esrO2loI7Y
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024
ALSO READ: Rishabh Pant: రిషబ్ పంత్ కు భారీ జరిమానా